Wednesday, April 28, 2010

ప్రయోగం ఏమైంది?



తొలి స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్‌తో భారత అంతరిక్ష కేంద్రం (ఇస్రో) శాస్త్రవేత్తలు రూపొందించిన జిఎస్ఎల్‌వి-డీ3 రాకెట్ ప్రయోగం విఫలమైంది. 18 సంవత్సరాల పాటు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించి రూపొందించిన మొట్టమొదటి క్రయోజినిక్ ఇంజిన్‌తో తయారైన జిఎస్ఎల్‌వి-డీ3 రాకెట్‌ షార్ నుంచి నిప్పులు కక్కుతూ నింగికెగసింది.

కానీ నిర్దేశిత కక్ష్య నుంచి రాకెట్ పక్కకు తొలగి పోవడంతో షార్ సెంటర్‌‍కు సమాచారం అందలేదని ఇస్రో తెలిపింది. దీంతో జిఎస్ఎల్‌వి-డీ3 రాకెట్ ప్రయోగం విఫలమైనట్లు వారు ప్రకటించారు.

గత 18 సంవత్సరాలుగా రెండువేలకు మించిన అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణుల సమిష్టి కృషితో నిర్మించిన క్రయోజనిక్ ఇంజిన్‌తో కూడిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్ "జీ శాట్-4"ను రాష్ట్రంలోని శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి గురువారం సాయంత్రం ప్రయోగించారు.

50 మీటర్లు ఎత్తు, 416 టన్నుల బరువుతో కూడిన జీఎస్ఎల్‌వీ రాకెట్‌... ప్రయోగించిన కాసేపట్లోనే దారి తప్పింది. ఫలితంగా జీఎస్ఎల్‌వి ప్రయోగం విఫలమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.

కక్ష్య నుంచి దారితప్పడంతో రాకెట్‌ నుంచి సమాచారం అందలేదని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. జిఎస్ఎల్‌వి-డీ3 ప్రయోగం వైఫల్యానికి గల కారణాలను పరిశీలిస్తామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వైఫల్య కారణాలను పరిశీలించి ఏడాదిలోపు తిరిగి రాకెట్ ప్రయోగాన్ని చేపడతామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.